News April 16, 2024
ఉమ్మడి తూ.గో ఓటర్ల తీర్పు ఏంటో..?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే నానుడి ఉంది. 2009లో కాంగ్రెస్-11, పీఆర్‌పి- 4, టీడీపీ-4 చోట్ల విజయం సాధించాయి. 2014లో టీడీపీ-13, వైసీపీ-5, ఇండిపెండెంట్-1 గెలిచాయి. 2019లో వైసీపీ-14, టీడీపీ-4, జనసేన-1 సీటు గెలిచాయి. మరి 2024లో ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందో కామెంట్ చేయండి.
Similar News
News April 20, 2025
రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత

పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు హర్షకుమార్‌ను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. క్రైస్తవులు, వివిధ సంఘాల నేతలు పాస్టర్ ప్రవీణ్‌కి నివాళులర్పించారు. పరిస్థితి ఉద్రిక్తత అవ్వడంతో నలుగురు నేతలను అదుపులోకి తీసుకుని రాజనగరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News April 20, 2025
రాజమండ్రి: మాజీ ఎంపీపై మూడో కేసు నమోదు

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్‌పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.
News April 20, 2025
రాజమండ్రి: మాజీ ఎంపీ పై మూడవ కేసు నమోదు

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించడంపై కేసు నమోదు పోలీసులు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్ పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.