News August 5, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు వర్షాలకు ఛాన్స్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల సోమవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తూ.గో, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
SHARE IT..

Similar News

News August 25, 2025

నేడు 5,57,710 డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

image

నిడదవోలులో సోమవారం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి మండలంలో స్థానిక ప్రతినిధుల ఆధ్వర్యంలో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొననున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 5,57,710 డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామన్నారు.

News August 24, 2025

పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించాలి: ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆగస్టు నెలకు సంబంధించి అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఆదివారం నెలవారి నేర సమీక్షను తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. గంజాయి కేసుల్లో పాత నిందుతులను కచ్చితంగా రీ విజిట్ చేయాలన్నారు. పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూలు త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు.

News August 24, 2025

బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్, సబ్ జూనియర్ పురుషులు, మహిళలు, బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్లను నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం హై స్కూల్లో ఆదివారం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఈ జట్లు ఈనెల 29 నుంచి 31 వరకు ప్రకాశం జిల్లా చేవూరులో నిర్వహించే అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు ఆలపాటి కాశీ విశ్వనాథం తెలిపారు.