News August 13, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో పిడుగులు పడే అవకాశం

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరిక హెచ్చరించింది. రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం, ఏజెన్సీ ప్రాంతంలో పిడుగులు పడవచ్చని అధికారులు ప్రకటించారు. సెల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. ఆరు బయట, చెట్ల కింద ఉండవద్దని సూచించింది.

Similar News

News August 24, 2025

తూ.గో: 5.59 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం

image

తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన 5,59,302 స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ పూర్తయిందని, వాటిని తహశీల్దార్ కార్యాలయాలకు పంపినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు శనివారం తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కార్డుదారుల ఇళ్ల వద్దే వీటిని పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News August 24, 2025

‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పనితీరు సూచికలను (KPI) ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్‌లో కేపీఐ లక్ష్యాలు, వాటి సాధనపై ఆమె సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

News August 23, 2025

చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి: కలెక్టర్

image

చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో జరిగిన హస్తకళా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడం మన సంస్కృతికి, కళాకారుల అభివృద్ధికి అవసరమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.