News December 21, 2025
ఉమ్మడి తూ.గో. జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరే..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులను పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసి, వారి పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా గుత్తుల సాయి ప్రసాద్ ను నియమించారు. కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జ్యోతుల నవీన్ పేరును ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా బొడ్డు వెంకటరమణ చౌదరిని ఖరారు చేశారు. ప్రధాన కార్యదర్శులను కూడా ప్రకటించారు.
Similar News
News December 27, 2025
‘ఎపిడ్యూరల్ అనల్జీసియా’ అంటే?

కర్నూలు జీజీహెచ్ వైద్యులు తొలిసారి ‘ఎపిడ్యూరల్ అనల్జీసియా’ పద్ధతిలో <<18678258>>నొప్పులు లేని ప్రసవాన్ని<<>> విజయవంతం చేశారు. ఈ విధానంలో అనస్థీషియా నిపుణులు వెన్నెముకలోని ఎపిడ్యూరల్ స్పేస్‌లో చిన్న క్యాథెటర్ ద్వారా మందులను పంపుతారు. ఇది నడుము కింది భాగాన్ని మొద్దుబార్చి, తల్లి స్పృహలో ఉంటూనే నొప్పి లేకుండా సుఖ ప్రసవం పొందేలా చేస్తుంది. సాధారణ ప్రసవం పట్ల భయం పోగొట్టే ఈ పద్ధతి ప్రముఖ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది.
News December 27, 2025
ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్ ఇండియాలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్ ఇండియా 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థుల జనవరి 31 వరకు ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంబీఏ(HR), LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు రూ.70,000, అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ.83,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ieindia.org
News December 27, 2025
కొత్త ఏడాదిలో.. పాత సమస్యలకు ఎండ్ కార్డు పడేనా..!

గుంటూరు జిల్లా ఎన్నో ఏళ్లుగా మౌలిక వసతుల లోపాలతో ముందుకు సాగుతోంది. డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వేసవిలో తాగునీటి కొరత తలెత్తడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఎన్నికల సమయంలో హామీలు వినిపిస్తున్నప్పటికీ, సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. కొత్త ఏడాదిలోనైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.


