News April 16, 2025
ఉమ్మడి తూ.గో.లో 202 పోస్టులు

ఉమ్మడి తూ.గో.జిల్లాలో 202 ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 127 SGT (ప్రాథమిక స్థాయి), 75 స్కూల్ అసిస్టెంట్ల (ద్వితీయ స్థాయి) పోస్టులు మంజురైనట్లు అధికారులు తెలిపారు. వీటిని ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News April 16, 2025
RGM: ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి: CP

నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని CPప్రారంభించారు. ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. CPR చేసే విధానం గురించి సీపీ సిబ్బందికి వివరించారు.
News April 16, 2025
MBNR: రైల్వే శాఖ అధికారులతో ఎంపీ సమీక్ష

క్యాంపు కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులు, ROB, RUB నిర్మాణం పురోగతిపై ఆమె సమీక్షించారు. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయడం ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని డీకే అరుణ అధికారులకు సూచించారు. తమ దృష్టికి వచ్చిన రైల్వే సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని అధికారులు ఎంపీకి చెప్పారు.
News April 16, 2025
MBNR: అధికారులు ఎందుకు పరామర్శించలేదు: మాజీ మంత్రి

ఇటీవల దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్లో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సమీపంలో ఉన్న క్వారీలో నీటిలో మునిగిపోయి మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబీకులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు పరామర్శించారు. ముగ్గురు చనిపోతే కనీసం కలెక్టర్, ఎస్పీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలని ఆదుకోవాలన్నారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.