News February 13, 2026

ఉమ్మడి నల్గొండలో తొలి విజయం బీజేపీదే

image

యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఖాతా తెరిచింది. ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ 56 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పార్టీ సిద్ధాంతాలను, తనను నమ్మి ఓటు వేసిన ఓటర్లకు ఆమె మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. రాధ విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

Similar News

News April 8, 2026

వేసవిలో జాగ్రత్త: పిల్లలను ఈతకు పంపొద్దు

image

వేసవి తీవ్రత దృష్ట్యా చెరువులు, బావుల్లో <<19595547>>ఈతకు<<>> వెళ్తున్న విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జిల్లాలో విషాదం నింపుతున్నాయి. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతకమైన చోట్ల ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇటువంటి విషాదాల నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు.

News April 8, 2026

ఆదిలాబాద్: ఎస్‌ఏ-2 పరీక్షలకు సర్వం సిద్ధం

image

రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఎస్‌ఏ-2 (వార్షిక) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టాస్ (TOSS) పరీక్షల నేపథ్యంలో గత షెడ్యూల్‌ను విద్యాశాఖ రెండు రోజులు ముందుకు మార్చింది. ఏప్రిల్ 18 వరకు ఇవి కొనసాగుతాయి. నేడు 6-9 తరగతుల వారికి ప్రథమ భాషా పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు మారిన సమయాలను గమనించి హాజరు కావాలని డీఈఓ సూచించారు.

News April 8, 2026

నల్గొండలో గులాబీ వ్యూహం: 6 చోట్ల కొత్త అభ్యర్థులు?

image

వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అప్పుడే కసరత్తు ముమ్మరం చేసింది. ఉమ్మడి నల్గొండలో వ్యతిరేకత ఉన్న ఆరు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రజాదరణ కోల్పోయిన నేతలపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల మార్పు ద్వారానైనా మళ్లీ పట్టు సాధించాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.