News May 1, 2024
ఉమ్మడి నల్గొండలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండగా.. ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం యాదగిరిగుట్ట, వలిగొండ, మునగాల, చండూరులో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్త అవసరం.
Similar News
News December 27, 2024
రాజాపేట: వారం పాటు పోరాడిన దక్కని చిన్నారి ప్రాణం
ఇంట్లో ఆడుకుంటుండగా కట్టెలపొయ్యి మంటలు అంటుకుని చిన్నారికి ఈ నెల 20న గాయాలవగా HYD గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాప గురువారం మృతిచెందింది. పోలీసుల వివరాలిలా.. రాజాపేట మండలం రేణిగుంటకి చెందిన ఎర్ర పరమేశ్, స్వప్న దంపతుల కుమార్తె సాక్షి (3) ఇంట్లో ఆడుకుంటుండగా మంట అంటుకుంది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజాపేట పోలీసులు తెలిపారు.
News December 26, 2024
NLG: అటు ముసురు.. ఇటు చలి తీవ్రత
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బుధవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులతో ముసురుకుంది. ఒకవైపు ముసురు.. మరో వైపు చలి తీవ్రతతో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై జన సందడిగా మోస్తరుగా కనిపించింది. చలి తీవ్రత కారణంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
News December 26, 2024
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలుగుబెల్లి భాగ్యమ్మ ఉదయం 5గం.లకు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమె మృతి పట్ల టీఎస్ యుటీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, అనీల్, జిల్లాలోని మండల శాఖల పక్షాన సంతాపం ప్రకటించారు.