News October 11, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ నియోజకవర్గం జీవీ గూడెం, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ, మునుగోడు నియోజకవర్గం కల్వకుంట్ల గ్రామంలో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నారు.
Similar News
News April 17, 2026
మిల్లర్లు రైతులకు అండగా నిలవాలి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా అన్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యం లోడుతో మిల్లుల వద్ద లారీలు పడిగాపులు కాయకూడదని అన్నారు.
News April 16, 2026
NLG: లక్ష్యం దిశగా రబీ కొనుగోళ్లు..

NLG జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 5,512 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇప్పటివరకు జరిగిన మొత్తం కొనుగోళ్లు 36,360 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. సేకరించిన ధాన్యంలో 36,298 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 62 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉంది. ఈ కొనుగోళ్ల ద్వారా ఇప్పటివరకు 4,112 మంది రైతులు లబ్ధి పొందారు.
News April 16, 2026
NLG: పాడి గేదెల పథకానికి లాస్ట్ డేట్ ఇదే

నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా అమలు చేస్తున్న 2 పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 70 శాతం సబ్సిడీతో కూడిన ఈ పథకానికి అర్హులైన ఎస్సీ అభ్యర్థులు OBMMS వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


