News March 19, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంపీ ఎన్నికలపై కసరత్తు

image

లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంల చెకింగ్ పూర్తి కాగా.. క్షేత్రస్థాయిలో పోలింగ్ సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లను NLG, SRPT, YDD జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. NLG లోక్‌సభ స్థానానికి కలెక్టర్ హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనుండగా, BNGకి హనుమంతు కె జెండగే ఆర్వోగా వ్యవహరిస్తారు.

Similar News

News February 5, 2026

నల్గొండ: ‘పుర’ పోరులో పాత నేతలే.. గుర్తులు వేరు

image

నల్గొండ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల సమరం ఉత్కంఠగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అసలైన అభ్యర్థుల జాబితా ఖరారైంది. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీ పడుతున్నారు. నాయకులు వారే అయినా, పార్టీ గుర్తులు మాత్రం మారాయి. అధికార పార్టీ అండతో విజయంపై వారు ధీమాగా ఉండగా, సామాన్య ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

News February 5, 2026

NLG: భార్యల గెలుపునకు భర్తల ఇంటింటి ప్రచారం

image

మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో భర్తల కోసం భార్యలు ప్రచారం చేయగా, ఇప్పుడు భార్యల గెలుపు కోసం భర్తలు జెండాలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ముఖ్యంగా నల్గొం, మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠాలు మహిళలకే కేటాయించడంతో అభ్యర్థుల భర్తలు ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News February 5, 2026

NLG: ఏదీ గిరి వికాసం.. అటకెక్కిన మరో పథకం!

image

జిల్లాలో గిరిజన రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంతో చేపట్టిన సీఎం గిరి వికాస పథకం అటకెక్కింది. రెండేళ్ల క్రితమే జిల్లావ్యాప్తంగా గిరిజన లబ్ధిదారులను గుర్తించి వారి భూముల్లో 56 బోర్లు వేసినా.. వాటికి విద్యుత్ సౌకర్యం, మోటార్లు అందించలేదు. రెండేళ్లుగా ఎలాంటి కదలిక లేకపోవడంతో అసలు ఈ పథకం ఉందా లేదా అని లబ్ధిదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.