News March 24, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
Similar News
News January 29, 2026
సూర్యాపేట: హస్తం పార్టీలో టికెట్ల లొల్లి

SRPT మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తారు. 48 వార్డులకు 600 దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వార్డుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులు ఉంటారని భావించినా, భారీగా అప్లికేషన్లు రావడంతో హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఉత్తమ్, సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీ అభ్యర్థుల వడపోత పూర్తి చేసిన తర్వాతే బీ-ఫామ్ అందజేయనున్నారు.
News January 29, 2026
NLG: కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి నేపథ్యం ఇదే..

NLG కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్యను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి మేయర్ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేశారు.
పేరు: బుర్రి చైతన్య
భర్త: శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్
కుమారులు: ఇద్దరు
తల్లిదండ్రులు: బండ సరోజ, అంజిరెడ్డి
పదవులు: 2011 నుంచి 2018 వరకు రామాలయం ఛైర్మన్‌గా, 2020 నుంచి 2025 వరకు 33వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు.
News January 29, 2026
నల్గొండ: మున్సిపల్ పోరు.. తొలిరోజే 44 నామినేషన్లు

నల్గొండ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. 162 వార్డులకు గాను తొలిరోజైన బుధవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 16, కాంగ్రెస్ 14, బీజేపీ 9 నామినేషన్లు రాగా, స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. నల్గొండలో అత్యధికంగా 11 మంది దరఖాస్తు చేయగా, హాలియాలో బోణీ కాలేదు. ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.


