News July 29, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సైల బదిలీలు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. నార్కెట్ పల్లి ఎస్సైగా క్రాంతి కుమార్, చిట్యాల ఎస్సైగా ధర్మ, నాగారం ఎస్సైగా ఐలయ్య, నూతనకల్ ఎస్సైగా మహేంద్ర నాథ్, తిరుమలగిరి ఎస్సైగా సురేశ్, అర్వపల్లి ఎస్సైగా బాలకృష్ణ బదిలీ అయ్యారు.

Similar News

News February 5, 2026

NLG: తగ్గుతున్న పంటల సాగు.. వరిదీ అదే పరిస్థితి

image

మారిన వాతావరణ పరిస్థితులు.. సాగు ఖర్చులు పెరగడం.. దిగుబడులు తగ్గడం గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతుంది. ఈ యాసంగిలో జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని పేర్కొన్నప్పటికీ.. ఈ సీజన్ ముగిసేనాటికి 4.36 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయింది.

News February 5, 2026

నల్గొండ: పుట్టింటికి భార్య.. యువకుడి సూసైడ్

image

తాగుడుకు బానిసై ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కట్టంగూరు(M) ఇస్మాయిల్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు (29) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తాగుడుకు బానిసయ్యాడని అతని భార్య కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News February 5, 2026

నల్గొండ: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశాలకు ఆహ్వానం

image

ఎస్సీ స్టడీ సర్కిల్స్ ప్రవేశాలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని, మార్చి 1న నల్గొండ ఎన్జీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని, హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.