News January 22, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేపటి నుంచి షబ్బీర్ అలీ పర్యటన

image

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మూడు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు నిజామాబాద్‌లో పాలిటెక్నిక్ ఐటీఐ సందర్శనతోపాటు, నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాలను ప్రారంభిస్తారు. రాత్రి కామారెడ్డిలో బస చేస్తారు, ఎల్లుండి కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర, గ్రీన్ సిటీ, లిటిల్ స్కాలర్ స్కూల్ సమీపంలోని OHSR వాటర్ ట్యాంకులను సందర్శిస్తారు.

Similar News

News February 5, 2026

అనంత: బాలికను గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్!

image

మాయమాటలు చెప్పి ఇంటర్ చదువుతున్న అమ్మాయిని గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన గుత్తిలో చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఓబుళపతి విద్యార్థిని తన ఆటోలో రోజూ అనంతపురం రోడ్డులో ఉన్న కళాశాలకు తీసుకెళ్లేవాడు. వారి మధ్య పరిచయం పెరిగి, లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఈ క్రమంలో ఆమె 6 నెలలు గర్భవతి అని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆటో డ్రైవర్‌ను ఎస్సై సురేశ్ అదుపులోకి తీసుకున్నారు.

News February 5, 2026

కృష్ణా: రైలు ప్రయాణికులకు GOOD NEWS

image

ప్రయాణికుల రద్దీ మేర ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అనకాపల్లి(AKP)-సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. నం.07041 SC-AKP రైలు ఈ నెల 22న, నం.07042 AKP-SC రైలు 23న నడుపుతున్నామన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ AC, స్లీపర్, జనరల్ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని వెల్లడించారు.

News February 5, 2026

సాగునీటి సంఘాల ఛైర్మన్లతో నేడు సీఎం భేటీ

image

AP: అమరావతి పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇవాళ సాగునీటి సదస్సు జరగనుంది. రాష్ట్రంలోని 6,047 సంఘాలు, 58 ప్రాజెక్టు కమిటీలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లు హాజరుకానున్నారు. వారినుద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ, గ్రామ, మండల, జిల్లా పరిషత్ సమావేశాలకు సాగునీటి సంఘాల ఛైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడంపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.