News November 10, 2025

ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు అలర్ట్

image

రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిడ్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు పొగమంచు ప్రభావం ఉంటుందని, వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 10, 2025

MSMEలకు ఆధునిక సౌకర్యాలు

image

AP: రాష్ట్రంలోని MSMEలకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే తరహా పరిశ్రమలున్న క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల(CFC)ను ఏర్పాటుచేయనుంది. ఒక్కోదానికి ₹10కోట్లు వెచ్చించనుంది. ఇందులో కొత్త డిజైన్లు, రీసెర్చ్, టెక్నాలజీ, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ తదితర సదుపాయాలు ఉంటాయి. వీటివల్ల MSMEలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశం లభిస్తుంది.

News November 10, 2025

ప్రజ్ఞ యాప్ తో మహిళలు కుస్తీ

image

మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు కొత్త టాస్క్ నిర్వహిస్తుంది. వివిధ రకాల శిక్షణ, ప్రస్తుత కాలంలో ఉపయోగపడే యాప్స్, గూగుల్ డ్రైవ్ తదితర అంశాలపై ప్రజ్ఞ యాప్ డౌన్ లోడ్ చేసుకుని వీడియోలు విని చివరిలో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంఘ మిత్రాలు మాత్రం మొత్తం ఒకేసారి విని సమాధానాలు పెట్టాలంటూ సభ్యులను ఆందోళనలకు గురి చేస్తున్నారు. 10 వీడియోలు ఓకేసారి వినలేక ఇబ్బందులు పడుతున్నారు.

News November 10, 2025

నర్సంపేట: క్లాత్ స్టోర్ దగ్ధం.. రూ.80 లక్షల నష్టం..!

image

నర్సంపేటలోని జయశ్రీ టాకీస్ సమీపంలో ఉన్న శివరామ క్లాత్ స్టోర్‌లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు షాపు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో షాపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, విలువైన దుస్తులు దగ్ధం కావడంతో సుమారు రూ.80 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు యజమాని రాజు తెలిపారు.