News April 2, 2024
ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్
ఉమ్మడి జిల్లాలో వాతావరణం రోజురోజుకూ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 5 వరకు ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Similar News
News December 25, 2024
MBNR: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. మరి MBNR, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి.
News December 25, 2024
MBNR: మెదలైన ఎన్నికల సందడి.. యువత ఓటు ఎటు?
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యువత ఓటును ఆకర్షించడానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సారి యువత ఓటు అధిక సంఖ్యలో నమోదు కావడంతో స్థానిక నాయకులలో భయం మొదలైంది. యువత మాత్రం అభివృద్ధి వైపే ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా నాయకులు ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
News December 24, 2024
MBNR: అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వినతి
మహబూబ్‌నగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఒబేదుల కోత్వాల్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.