News March 14, 2025

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడి భగభగలు..

image

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూ‌నగర్ జిల్లా కొత్తపల్లిలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా జక్లేరులో 40.1 డిగ్రీలు, వనపర్తి జిల్లా కేతపల్లిలో 40.0 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలో 40.0 డిగ్రీలు, గద్వాల జిల్లా మల్దకల్లో 40.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 9, 2025

రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవచ్చా?

image

రోడ్డు పక్కన ఇంటి నిర్మాణాలు ఎలా ఉండాలో వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవాలంటే స్థానిక సంస్థల అనుమతి ఉండాలి. రోడ్డు వెడల్పును బట్టి ఎత్తు పరిమితిని నిర్ణయిస్తారు. వాస్తు శాస్త్రం కూడా దీనిని నిర్ధారిస్తుంది. అయితే ఇంటికి రోడ్డుకు మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండాలి. గాలి, వెలుతురు ఇంట్లోకి రావడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి’ అని ఆయన చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 9, 2025

సంక్రాంతికి రవితేజ సినిమా.. రేపే ఫస్ట్ లుక్

image

రవితేజ 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఆశికా రంగనాథ్ హీరోయిన్‌. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజకు ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందేమో చూడాలి.

News November 9, 2025

HYD: ఫ్రాన్స్‌లో MBBS పూర్తి చేసి ఉగ్రవాదం వైపు

image

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.