News September 10, 2025
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిండిన చెరువులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,086, నాగర్‌కర్నూల్‌లో 1,222, వనపర్తిలో 1,096, నారాయణపేటలో 650, జోగులాంబ గద్వాలలో 375 చెరువులు దాదాపు 90 శాతం వరకు నిండిపోయాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మీ దగ్గర చెరువులు నిండాయా..? COMMENT
Similar News
News September 10, 2025
మనం రోజూ వాడే ఈ పదాల అబ్రివేషన్ తెలుసా?

*WiFi- వైర్‌లెస్ ఫిడిలిటీ, *ATM- ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్, *RIP – రెస్ట్ ఇన్ పీస్, *AM- యాంటి మెరిడియన్, *PM- పోస్ట్ మెరిడియన్, *QR Code- క్విక్ రెస్పాన్స్ కోడ్, *PIN- పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, *IQ- ఇంటెలిజెన్స్ కోషెంట్ (తెలివితేటలు), *PDF- పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, *SIM- సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్, *GPS- గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.
News September 10, 2025
రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై ఛార్జ్ షీట్..!

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతల చెవిరెడ్డి భాస్కర్, MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్.. వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే MPకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు మోహిత్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ స్వామి, విజయానంద రెడ్డిపై సిట్ విచారణ చేపట్టింది. దీంతో వీరి భవితవ్యం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.
News September 10, 2025
ఈనెల 15 నుంచి MNCLలో ఆగనున్న వందే భారత్

నాగపూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ఈనెల 15 నుంచి నిలపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ హాల్టింగ్‌కు కేంద్ర రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది. ప్రారంభ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. వందే భారత్ హాల్టింగ్‌పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.