News November 19, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. నవాబుపేటలో 13.5 డిగ్రీలు, దామరగిద్ద 13.7, బాలానగర్ మండలం ఉడిత్యాల 13.9, మిడ్జిల్ మండలం దోనూరు 14,9, కోస్గి 14.4, తలకొండపల్లి 14.9, తెలకపల్లి 15.8, తాడూరు 15.9, తిమ్మాజిపేట 16.1° వెల్దండ 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Similar News

News December 3, 2024

షాద్ నగర్: ప్రశంసలే కాదు..విమర్శలు కూడా స్వీకరిస్తా: MLA

image

ఏడాది పాలన పూర్తి చేసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు పూల బొకేతో శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. తప్పులు జరిగినప్పుడు విమర్శించినా స్వీకరిస్తానని, సమస్యలు ఉంటే తన దృష్టికి తెచ్చినప్పుడు తప్పనిసరిగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

News December 3, 2024

దేవరకద్ర: బస్సుల సంఖ్యను పెంచాలని మంత్రికి వినతి

image

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సంఖ్యలు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో త్రిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి బస్సుల సంఖ్యను పెంచుతానని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

News December 3, 2024

వనపర్తి: యాక్సిడెంట్.. అక్కాతమ్ముడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25) అక్క పద్మ(31)ను ఆమె కుటుంబంతో కుంట్లూర్‌కు బయలుదేరారు. కోహెడ-పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్‌లో లారీ అకస్మాత్తుగా నిలపడంతో వేగంగా వస్తున్న వీరి కారు ఢీకొంది. ఈప్రమాదంతో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.