News April 16, 2024

ఉమ్మడి పాలమూరు వాసులకు గమనిక..!

image

ఎర్లీబర్డ్ స్కీమ్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రిబేట్ పొందవచ్చని ఆయా మున్సిపల్ కమిషనర్లు తెలిపారు. ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉందని, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SHARE IT

Similar News

News April 22, 2025

MBNR: KCR సభ.. భారీగా జన సమీకరణకు నేతల ప్లాన్

image

వరంగల్‌లో ఈనెల 27న BRS రజతోత్సవ భారీ బహిరంగ సభకు MBNR, WNP, NGKL, NRPT, GDWL జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఒక్క ఉమ్మడి పాలమూరు నుంచే సభకు 2 లక్షల మందికి పైగా తరలించేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి సూచనలతో వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందరం KCRసభకు వెళ్దామని శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

News April 22, 2025

MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 42.1 డిగ్రీలు, నవాబుపేట 42.0 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్తమొల్గర 41.9 డిగ్రీలు, దేవరకద్ర 41.8 డిగ్రీలు, కౌకుంట్ల 41.5 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లి, మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 22, 2025

నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

image

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్‌లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!