News October 19, 2024
ఉమ్మడి ప్రకాశం రీజినల్ కోఆర్డినేటర్ ఇతనే.!
వైసీపీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఏపీలోని పలు జిల్లాలకు ఏడుగురు నాయకులను రీజనల్ కో- ఆర్డినేటర్లుగా నియమించారు. దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును నియమిస్తూ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News November 24, 2024
పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి: కలెక్టర్
పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శనివారం సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా బోధనతో పాటు పారిశుధ్యం పైన కూడా దృష్టి సాధించాలన్నారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లిష్, గణితంలో పిల్లల పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు.
News November 24, 2024
IPL వేలంలో మన ప్రకాశం కుర్రాడు.!
IPL మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన మనీశ్ రెడ్డి రూ.30 లక్షల బేస్ ఫ్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన ప్రకాశం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 24, 2024
సంతనూతలపాడు ZPHSలో కలెక్టర్ తనిఖీలు
సంతనూతలపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లల్లో అభ్యాస శక్తిని పెంపొందించాలని సూచించారు.