News July 19, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టరేట్ల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప.గో కలెక్టర్ సి.నాగరాణి, ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం సాధారణ సెలవు కావడంతో తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. SHARE IT..

Similar News

News March 1, 2026

తాగునీటి సరఫరాకి ఇబ్బందులు లేకుండా చూడండి: జేసీ

image

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భీమవరం కార్యాలయంలో నుంచి గూగుల్ మీట్ ద్వారా శనివారం సమీక్షించారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా ఉండేలా నీటి నిల్వలు, పంపింగ్ స్టేషన్లు, పైప్‌లైన్ మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News February 28, 2026

ఉండి: గ్యాస్ ప్రమాదం ఘటనలో మరో మహిళ మృతి

image

ఉండి చిక్కాల వీరన్న నగరంలో ఈనెల 24వ తేదీన జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి చెందారు. ఎస్సై నజీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ సర్వీస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో లక్ష్మి (50) గురువారం మృతి చెందింది. ఆమె తల్లి సుబ్బాయమ్మ (70) ఇప్పటికే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు విజయవాడలో చికిత్స పొందుతున్నారని అన్నారు.

News February 28, 2026

నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్‌ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.