News January 1, 2026
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✒ MBNR: ట్రాలీ బోల్తా.. 15 మేకలు మృతి
✒ NGKL:ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై నాగం ఫైర్
✒ ట్రాఫిక్ నియమాలు పాటించండి: అదనపు కలెక్టర్
✒ సౌత్ జోన్..PU షటిల్, బ్యాట్మెంటన్ జట్టు రెడీ
✒ MBNR: 31st ఎఫెక్ట్.. 86 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు
✒ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు ప్రారంభం
✒ MBNR: సన్నద్దత పోస్టర్ ఆవిష్కరించిన వీసీ
✒ మహబూబ్‌నగర్ ఎస్పీకి ప్రమోషన్
Similar News
News January 2, 2026
వైరల్ వీడియోతో రాజుకున్న సింహాచలం వివాదం..

సింహాచలం ప్రసాదంలో నత్త ఉన్నట్లు వైరల్ అయిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన కుట్రగా ఆలయ సిబ్బంది పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, తప్పు ఎవరిదని తేలితే కఠిన చర్యలు తప్పవని MLA గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని.. పులిహోరలో నత్త ఉందని చెబితే కేసులు పెడతారా? అంటూ YCP నేతలు ప్రశ్నిస్తున్నారు.
News January 2, 2026
కరీంనగర్: అందుబాటులోకి ‘మన స్త్రీనిధి’ యాప్ సేవలు

స్వయం సహాయక సంఘాల రుణాల పంపిణీ, వసూళ్లలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మన స్త్రీనిధి’ యాప్ సేవలు ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సభ్యులు తాము తీసుకున్న రుణం ఎంత? చెల్లించింది ఎంత? ఇంకా ఎంత బాకీ ఉంది? అనే వివరాలను గ్రూప్ లీడర్ల అవసరం లేకుండా నేరుగా తమ మొబైల్‌లోనే చూసుకొని ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా సులభంగా రుణాలు చెల్లించవచ్చు.
News January 2, 2026
నల్గొండ జిల్లాను కప్పేసిన మంచు దుప్పటి

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కురుస్తూనే ఉండడంతో ప్రధాన రహదారుల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడం.. వాతావరణం చల్లగా ఉండడంతో అటు ప్రజలు.. ఇటు స్కూల్ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.


