News July 30, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాకు 87 కొత్త బస్సులు

మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ డిపోలకు కొత్తగా 87 బస్సులు వచ్చినట్లు మేనేజర్ ప్రభులత ఓ ప్రకటనలో తెలిపారు. మెదక్ రీజియన్ పరిధిలో ఇప్పటి మహలక్ష్మి పథకం కింద 3.80 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని, ఈ పథకం తర్వాత 70% ఉన్న ఓఆర్ 98 శాతానికి చేరిందని ప్రకటనలో పేర్కొన్నారు. రీజియన్ పరిధిలో 10 డీలక్సు, 35 పల్లెవెలుగు, 42 ఎక్స్‌ప్రెస్ బస్సులు కొత్తగా వచ్చాయన్నారు.
Similar News
News December 21, 2025
మెదక్: లోక్ ఆదాలత్‌లో 3093 కేసులు పరిష్కారం

మెదక్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన లోక్ అదాలతో 3093 కేసులు పరిష్కారం అయినట్లు కోర్టు అధికారులు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు తమ తమ పరిధిలో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. న్యాయమూర్తులు శుభవలీ, రుబినా ఫాతిమా, సిరి సౌజన్య, మాయా స్వాతి, సిద్ధి రాములు, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మర్కంటి రాములు పాల్గొన్నారు.
News December 21, 2025
మెదక్: కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక

మెదక్ జిల్లా స్థాయి కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక గుల్షన్ క్లబ్ ఆవరణలో నిర్వహించారు. 50 మంది పురుషులు, 40 మంది మహిళలు ఎంపిక ప్రక్రియలో పాల్గొనగా 14 మంది చొప్పున ఎంపిక చేశారు. ఈనెల 25 నుండి కరీంనగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు, ప్రభు పాల్గొన్నారు.
News December 20, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

22న సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారాలు, విపత్తులను ఎదుర్కొనే విషయంలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణలో పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరన్నారు.


