News August 31, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాకు PINK ALERT⚠️

image

ఉమ్మడి జిల్లాలోని మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News September 17, 2025

మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

image

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.

News September 17, 2025

జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

image

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.

News September 17, 2025

మెదక్: కలెక్టరేట్ త్రివర్ణమయం

image

17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్ మూడు రంగుల విద్యుత్ దీపాలతో త్రివర్ణ మయంగా ముస్తాబు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఉదయం 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.