News January 11, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్, అందోల్ 14.3, చౌటాకూర్, కోహిర్ 14.5, మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట 15.0, టేక్మాల్ 15.1, నిజాంపేట్ 15.6, సిద్దిపేట జిల్లాలోని మార్కూక్ 14.6, దూల్మిట్ట 15.0 C ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రాబోయే రోజులలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, అస్తమా రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News November 5, 2025
MDK: ఆందోళనకు గురి చేస్తున్న ఆత్మహత్యలు

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఇటీవల యువకుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు యువకులు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి యువకులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 4, 2025
చిన్నశంకరంపేట: ‘బాల్య వివాహాలు చట్ట విరుద్ధం’

చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో విలేజ్ లెవల్ ఛైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి పద్మ, విజన్ ఎన్జీఓ ఆర్గనైజర్ యాదగిరి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. 18 ఏళ్లలోపు బాలిక, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చట్ట విరుద్దమన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులంతా కలిసి బాల్య వివాహాలు చేయమని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు.


