News January 21, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉష్ణోగ్రత వివరాలు.. కోహీర్ 7.0, ఆల్గోల్, న్యాల్కల్ 8.4, నల్లవల్లి 8.8, మల్చల్మ 9.0, కంకోల్ 9.1, సత్వార్ 9.2, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ 9.4, నిజాంపేట, ఝరాసంఘం, దిగ్వాల్ 9.6, కల్హేర్ 9.8, కంగ్టి 9.9, అంగడికిష్టాపూర్, లక్ష్మీసాగర్, మొగుడంపల్లి 10.2, కొండపాక, గౌరారం, జహీరాబాద్ 10.3, పోతారెడ్డిపేట, బేగంపేట 10.4, శివంపేట 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 13, 2026

MDK: అనుమతి పత్రం ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి: ఎస్పీ

image

మెదక్ మున్సిపాలిటీ కౌంటింగ్ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో వెస్లీ కళాశాలలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు సమీక్షించారు. అనుమతి పత్రాలు ఉన్నవారికే ప్రవేశం, కఠిన తనిఖీలు, మొబైల్ ఫోన్ల నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. BNSS 163 అమలులో ఉంటుందని, గుంపులు, ర్యాలీలు, డీజేలు నిషేధమన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 13, 2026

మెదక్: టెన్త్ క్లాస్ టాపర్‌కు బంపర్ ఆఫర్

image

నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామాలలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పరీక్షలలో మొదటి స్థానాన్ని పొందిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి, రెండో స్థానం రూ.3 లక్షల నగదు, జిల్లా టాపరుకు రూ.2 లక్షలు, నియోజకవర్గస్థాయికి రూ.10 వేలు అందిస్తున్నామన్నారు.

News February 12, 2026

మెదక్: ఓటింగ్‌లో మహిళా చైతన్యం భేష్.. !

image

మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు మరోసారి ఓటింగ్‌లో సత్తా చాటారు. 4 మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా 80.76 శాతం ఓటింగ్ నమోదు చేసి చైతన్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 44,591 మంది మహిళా ఓటర్లలో 36,015 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని 4 ఛైర్మన్ స్థానాలు మహిళలకే రిజర్వ్ కావడంతో మహిళా ఓటర్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో రేపటి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.