News January 4, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చలి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్ జిల్లాలోని బోడగట్టు, మనోహరబాద్, శివంపేట, నార్సింగి, కుల్చారం, సంగారెడ్డి జిల్లా కోహిర్, న్యాల్కల్, అల్మాయిపేట్, మాల్చెల్మా, నల్లవల్లి, అల్గోల్, సత్వార్, లక్ష్మీసాగర్, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్, పోతారెడ్డిపేట తదితర ప్రాంతాల్లో చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News January 6, 2025

సిద్దిపేట: యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు

image

యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం.. సిద్దిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి చిన్నకోడూరు వాసి చెందిన నిఖిల్ రెడ్డి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి 2 సార్లు గర్భవతి కాగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ఆమె నగ్నచిత్రాలు ఉన్నాయని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. నిఖిల్‌కు మరో యువతితో నిశ్చితార్థం అవ్వడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News January 6, 2025

మెదక్: స్థానిక పోరుకు సన్నద్ధం..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

News January 6, 2025

సంగారెడ్డి: 11వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు: డీఈఓ

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 18 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని కోరారు.