News January 10, 2026

ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ చలి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ చలి చంపేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ మూడు రోజులుగా మళ్లీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నాయి. కోహీర్ 7.6 డిగ్రీలు, న్యాల్కర్ 7.8, మెదక్ జిల్లా దామరంచ 10.3, సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్‌లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News April 4, 2026

అనకాపల్లి: రేపు హాకీ జట్టు ఎంపిక పోటీలు

image

రాష్ట్రస్థాయిలో జరిగే మహిళ హాకీ టోర్నమెంట్‌కు అంతర్ జిల్లాల ఎంపిక పోటీలు ఈనెల 5వ తేదీన ఎలమంచిలిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే.నరేష్ తెలిపారు. 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించినవారు ఈ పోటీలకు అర్హులుగా పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరిగే పోటీలకు ఆధార్ కార్డులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

News April 4, 2026

భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తాం: పాక్

image

పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తామని ప్రగల్భాలు పలికారు. ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బను మర్చిపోయి ఆయన ఇలా మాట్లాడటం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల సాకుతో పాక్ ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News April 4, 2026

TU: పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

TU పరిధిలోని డిగ్రీ (BA/B.Com/B.Sc/BBA) విద్యనభ్యసించే రెగ్యులర్ 2, 4, 6 సెమిస్టర్ల, 1, 3, 5 బ్యాక్ లాగ్ (2021 నుంచి 2025 వరకు) విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు నేడే చివరి తేదీ అని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుము రూ.100తో ఈ నెల 6 వరకు అవకాశముందన్నారు. ఈ నెల 18 నుంచి పరీక్షల షెడ్యూల్ సైతం ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు తప్పకుండా పరీక్ష ఫీజులు చెల్లించాలన్నారు.