News July 8, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు
Similar News
News April 5, 2026
మెదక్: బాబు జగ్జీవన్ రామ్‌కు కలెక్టర్ నివాళులు

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ మున్సిపల్ ఛైర్మన్ రాధిక భూపతి రాజు, తహశీల్దార్ లక్ష్మణ్ బాబు ఉన్నారు.
News April 5, 2026
దళిత బంధు పథకం జగ్జీవన్ రామ్ ఆలోచనల ప్రతిఫలం: కేసీఆర్

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలను స్మరించారు. సామాజిక న్యాయం, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి దేశ ప్రగతికి కృషి చేశారని పేర్కొన్నారు. దళిత సాధికారతకు దళిత బంధు వంటి పథకాలు ఆయన ఆలోచనల స్ఫూర్తితోనే అమలవుతున్నాయన్నారు.
News April 5, 2026
జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా బాబు జగ్జీవన్ రామ్ గుర్తుండిపోతారన్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు.


