News April 10, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్‌కు ఉగాది పురస్కారం

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.
Similar News
News April 18, 2025
మెదక్: ఈ నెల 21న అప్రెంటిషిప్ మేళా

ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా పథకం ద్వారా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 21న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొననున్నారని అన్నారు. మెదక్ జిల్లాలోని ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 18, 2025
మెదక్: పెళ్లికి అడ్డుగా ఉందని కూతురిని చంపిన తల్లి అరెస్ట్

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని పాపను తల్లి నదిలో పారేసిన ఘటన కొల్చారంలో జరిగింది. వివరాలు.. చిలిపిచెడ్(M)కి చెందిన గాయత్రీకి కొల్చారం(M) వాసితో పెళ్లైంది. వీరికి 4 నెలల కూతురు ఉంది. వీరి మధ్య గొడవలు జరుగుతుండటంతో గాయత్రీ కుమార్తెతో అదృశ్యమైంది. గాయత్రీనే రెండో పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని మంజీరాలో పాపను పారేసి హత్య చేసినట్లు తేలింది. గాయత్రీని, తండ్రి దీప్లా, అత్త బూలి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
News April 18, 2025
సంగారెడ్డి: భర్త ఆత్మహత్య

భార్యలు తన దగ్గర లేరని భర్త గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. అస్సాంకు చెందిన బిశాల్(30) కొల్లూరులో కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో బిశాల్ తరుచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నందిగామకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారు తరుచూ గొడవపడటంతో ఆమె కూడా వెళ్లింది. మనస్థాపం చెందిన బిశాల్ కారు వాష్ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.