News October 5, 2024
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం: చంద్రశేఖర్

రాష్ట్ర రవాణా శాఖ ఆదాయంలో 45 శాతం ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చిందని జిల్లా ఉప రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 33 జిల్లాల నుంచి రూ.3,195 కోట్ల ఆదాయం వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం రావడం జరిగిందన్నారు.
Similar News
News February 10, 2026
HYD: HCUలో కిటికీ గ్రిల్ తొలగించి ల్యాప్ టాప్ ల చోరీ

HCUలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ గ్రిల్ తొలగించి క్లాస్ రూమ్‌లోకి చొరబడి 50 ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. భవనంలోని వెనక కిటీకీ గ్రిల్ తొలగించడం, కారు టైర్ల గుర్తులను పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీ నలుమూలల ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనపై గచ్చిబౌలి PSలో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలరాజు తెలిపారు.
News February 9, 2026
రంగారెడ్డిలో నేటితో గప్ చుప్

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేడు సా.5 గంటలకు ముగియనుంది. దీంతో మైక్‌లు మూగబోనున్నాయి. డప్పుల హోరు.. నేతల ప్రసంగాల జోరుకు బ్రేక్ పడనుంది. కాగా.. ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఆదివారం ప్రధాన పార్టీల నేతలు ర్యాలీలతో హోరెత్తించారు. ఆఖరి ఘట్టమైన తాయిలాల పంపిణీకి అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
News February 9, 2026
రంగారెడ్డి జిల్లాలో 274 పోలింగ్ కేంద్రాలు

ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతుండగా మరోవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. RR జిల్లాలోని 126 వార్డుల్లో 1,75,974 మంది ఓటర్లు ఉండగా..వీరి కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500-800 మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. 620 బ్యాలెట్ బాక్సులు సహా 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించి,ఓటింగ్‌కు సిద్ధంగా ఉంచింది.


