News March 25, 2026
ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా 9 సీట్లు పెరిగే ఛాన్స్!

ఉమ్మడి వరంగల్‌లో జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాలు 9 పెరిగి 21 అయ్యే అవకాశం కనిపిస్తోంది. HNKలో 2 సీట్లుండగా కొత్తగా మరో 4, WGLలో 3 ఉండగా మరో 2, BHPLలో 1 ఉండగా మరొకటి, MHBDలో 2కి అదనంగా మరో 2 పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జనగామ(3), ములుగు(1)లో మాత్రం పెరిగే అవకాశం లేదు. WGL-HNK జిల్లాలో జనాభా 20 లక్షలకు పైగా ఉండటంతో ఇక్కడే 6 స్థానాలు, మానుకోటలో 8 లక్షల జనాభాతో 4 సీట్లు కొత్తగా రాబోతున్నాయి.
Similar News
News April 13, 2026
ANU: బీ ఆర్కిటెక్చర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్‌లో జరిగిన బీ ఆర్కిటెక్చర్ పరీక్షల ఫలితాలను పరీక్ష నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 2/5 ఒకటో సెమిస్టర్లో 62.50 శాతం, రెండవ సెమిస్టర్‌లో నూరు శాతం ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్, తదితర పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.inను సంప్రదించాలన్నారు.
News April 13, 2026
నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి: SP

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”లో జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 152 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.
News April 13, 2026
ఆసిఫాబాద్‌లో 1,689 ఇండ్ల బ్లాక్‌లు గుర్తింపు

జనాభా లెక్కలలో భాగంగా మే11 నుంచి ప్రారంభమయ్యే ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర జనాభా గణన సంచాలకులు భారతి హోలికేరి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇండ్ల జాబితా బ్లాక్‌లు, ఎన్యుమరేటర్లు, నియామకం, శిక్షణలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ASFలో 1,689 బ్లాక్‌లు, 994 ఎన్యుమరేటర్లు, 174 సూపర్వైజర్లు విధుల్లో ఉంటారని కలెక్టర్ హరిత తెలిపారు.


