News October 13, 2025

ఉమ్మడి వరంగల్‌లో మందకోడిగా మద్యం దరఖాస్తులు!

image

ఉమ్మడి WGL జిల్లాలో వైన్స్‌లకు దరఖాస్తు చేసేందుకు మద్యం వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు 294 షాపులకు కేవలం 258 దరఖాస్తులు రావడం గమనార్హం. సగటున ఒక వైన్సుకు ఒక దరఖాస్తు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ టెండర్ల దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మీరు టెండర్ వేస్తున్నారా?

Similar News

News October 13, 2025

NLG: ఈసారి కలిసి రాని కాలం.. పాపం కౌలు రైతన్న!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌలు రైతులకు ఈసారి కాలం కలిసి రాలేదు. భారీ వర్షాలు ఊహించని దెబ్బతీశాయి. చేతికొచ్చిన పత్తి, వరి పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోని సుమారు 2 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు. అటు కౌలు చెల్లించేందుకు డబ్బులు లేక, ఇటు పెట్టుబడి తిరిగి చేతికి వచ్చే పరిస్థితి లేక కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

News October 13, 2025

వికారాబాద్ జిల్లాలో కానరాని టాస్క్‌ఫోర్స్ దాడులు

image

వికారాబాద్ జిల్లాలో ఒకప్పుడు టాస్క్‌ఫోర్స్ అంటే అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టేది. కానీ, ఇప్పుడు జిల్లాలో ఒక్కసారిగా టాస్క్‌ఫోర్స్ సైలెంట్ కావడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. గతంలో జిల్లాలో రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, నకిలీ పదార్థాలపై దాడులు నిర్వహించిన ఫోర్స్ ఇప్పుడు ఒక్కసారిగా కామ్ అయిపోయింది. జిల్లాలో టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు చేయకుండా రాజకీయ నేతలు అడ్డుపడుతున్నారని ప్రజలు అంటున్నారు.

News October 13, 2025

NLG: 154 షాపులు.. 163 దరఖాస్తులు!

image

జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు డిపాజిట్ (నాన్ రిఫండబుల్) రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావహులు అంతగా ఆసక్తి చూపడం లేదు. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై 17 రోజులైనా 154 షాపులకు ఇప్పటివరకు 163 దరఖాస్తులే రావడంతో అధికారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.