News March 23, 2024
ఉమ్మడి వరంగల్‌లో వరుస ACB దాడులు

ACB దాడులతో ఉమ్మడి WGL జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహశీల్దారును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, తొలిసారిగా KUలో ఉద్యోగిని పట్టుకున్నారు. శుక్రవారం MHBD జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.
Similar News
News April 11, 2025
వరంగల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం

వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, హార్వెస్టింగ్ యజమానులతో అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద దేవి పాల్గొని 2024-2025 రబీ(యాసంగి) సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వ్యవసాయ అధికారి ఉన్నారు.
News April 11, 2025
ఎంపీ కావ్యకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

వరంగల్ ఎంపి డా.కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘డా. కడియం కావ్య.. మీకు హృదయపూర్వక పుట్టినరోజుకు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీ జీవితం ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను’ అని శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు.
News April 11, 2025
వరంగల్ మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.