News December 30, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MLG: విద్యుత్ షాకుతో రైతు మృతి..
> MHBD: కొమ్ములవంచలో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
> WGL: తిమ్మంపేట లో గుట్కా ప్యాకెట్లు పట్టివేత..
> JN: డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
> WGL: తల్లి, కూతురు సూసైడ్ అటెంప్ట్
> MLG: అడవి పంది, అడవి కోడిని వేటాడిన వ్యక్తులపై కేసు
> WGL: ధర్మారంలో గుర్తుతెలియని మృతదేహం

Similar News

News January 2, 2025

నేడు వరంగల్ మార్కెట్ రీ ఓపెన్

image

వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించగా నేడు ప్రారంభమవుతుందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. ఉ.6 గం.ల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభంఅవుతాయన్నారు. రైతులు నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచిధర పొందాలని సూచిస్తున్నారు.

News January 1, 2025

సిద్దేశ్వరుడికి మిఠాయితో ప్రత్యేక అలంకరణ

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సిద్దేశ్వరుడికి 51 రకాల, 51 కిలోల మిఠాయితో ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

News January 1, 2025

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి సీతక్క

image

సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలిసి న్యూఇయర్ విషెస్ తెలిపారు. అనంతరం పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.