News October 20, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేదారేశ్వర నోముల సంబరాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేదారేశ్వర నోములు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో కేదారేశ్వరుడికి పూజలు అర్పించి కుటుంబ శ్రేయస్సు, ధనసంపద కోసం ప్రార్థించారు. గ్రామాలంతా హారతుల కాంతులతో కళకళలాడగా, నోముల పాటలు, వంటల సువాసనలతో భక్తి వాతావరణం నెలకొంది. ఈసారి అమావాస్య రెండ్రోజులు రావడంతో కొందరు నేడు, మరి కొందరు మంగళవారం నోముకుని బుధవారం ఎత్తుకోనున్నారు. మీ నోములు ఎప్పుడు?
Similar News
News October 20, 2025
BREAKING: బాసరలో విషాదం.. కాలు తెగిపోయింది..!

నిర్మల్ జిల్లా బాసర మండలం టాక్లి గ్రామంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు శివ ఎప్పటిలాగే తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ రోటవేటర్‌తో పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో అతడి కాలు ఇరుక్కొని తెగిపోయింది. స్థానికులు గమనించి శివను బయటకు తీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు.
News October 20, 2025
వేధిస్తున్నారంటూ ఓలా ఉద్యోగి ఆత్మహత్య.. CEOపై కేసు

తనను వేధిస్తున్నారంటూ బెంగళూరులో Ola Electric ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. Ola ఇంజినీర్ అరవింద్ sept 28న సూసైడ్ చేసుకోగా, అతడి రూమ్‌లో డెత్‌నోట్‌ను పోలీసులు గుర్తించారు. CEO భవీశ్ అగర్వాల్, సీనియర్ ఉద్యోగి సుబ్రతా కుమార్ వేధిస్తూ, జీతాలివ్వలేదని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అరవింద్ చనిపోయిన 2రోజులకు అతడి ఖాతాలో ₹17.46L జమయ్యాయి. దీంతో ఈనెల 6న పోలీసులు భవీశ్‌పై కేసు నమోదు చేశారు.
News October 20, 2025
బాణసంచా పేలి గాయమైతే..

బాణసంచా పేల్చే సమయంలో గాయపడితే కాలిన భాగాన్ని 15 నిమిషాల పాటు కుళాయి నీటితో శుభ్రంగా కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల పటాకుల వేడి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా ఉంటుందని అంటున్నారు. అలాగే కాలిన భాగంలో పసుపు పొడి, పేస్ట్ వంటివి పూయకూడదని, దీనివల్ల గాయం ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడం కష్టం అవుతుందని తెలిపారు. పిల్లలు, వృద్ధులు ఉన్న చోట టపాకాయలు పేల్చవద్దని సూచిస్తున్నారు.