News December 26, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నగదు కొరత

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బ్యాంకుల్లో నగదు కొరతతో ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నవంబర్ నెలకు సంబంధించి 4 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.90 కోట్ల నగదు ప్రభుత్వం జమ చేసింది. విత్ డ్రా చేసేందుకు పోస్టాఫీస్‌, బ్యాంకులు వెళ్తున్న లబ్ధిదారులు నిరాశతో వెనుతిగుతున్నారు. RBI వద్ద నగదు కొరత, వరుస సెలవుల కారణంగా ఈ సమస్య నెలకొంది. కలెక్టర్లు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Similar News

News December 29, 2025

కర్నూలు: తిరుమల వెళ్లి వస్తుండగా విషాదం

image

ఒంటిమిట్ట మండలంలోని మట్టంపల్లి-నందలూరు మధ్య ఆదివారం సాయంత్రం పూణే ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ తెలిపారు. మృతుడు కర్నూలు జిల్లా అప్సరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

News December 29, 2025

అసెంబ్లీలో ‘వరంగల్’ గళం వినిపించేనా?

image

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది అధికార పక్షంలోనే ఉన్నప్పటికీ, నియోజకవర్గ సమస్యలపై వారు ‘అధ్యక్షా’ అంటూ నోరు విప్పుతారా? అని ప్రజానీకం ఎదురుచూస్తోంది. గ్రేటర్ వరంగల్ డివిజన్ల పెంపు, కాజీపేట బ్రిడ్జి, ఎయిర్ పోర్ట్, 24 అంతస్తుల ఆసుపత్రి నిధులపై ప్రజాప్రతినిధులు గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు.

News December 29, 2025

ప.గో: ఓ వైపు బరులు.. మరోవైపు వినతులు

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో పలుచోట్ల కోడి పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేస్తున్నారు. అధికారిక అనుమతులు రాకముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీరవాసరం, ఆకివీడు, భీమవరం మండలాల్లో పందేలను నివారించాలంటూ స్థానికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తుండటం గమనార్హం. ఓవైపు పందేలకు సన్నాహాలు, మరోవైపు ప్రజల అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.