News December 12, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఎంట్రీ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకొని సత్తాచాటింది. జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి సీన్ మారింది. గ్రామాల్లో సైతం కమలం పార్టీ పుంజుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 22 గ్రామ పంచాయతీలను బీజేపీ సొంతం చేసుకుంది. వరంగల్ జిల్లాలో 3, హనుమకొండలో 10, జనగామలో 1, మహబూబాబాద్‌లో 5, భూపాలపల్లిలో 3, ములుగులో మాత్రం ఖాతా తెరవలేదు.

Similar News

News March 6, 2026

ఎల్లుండే ఫైనల్.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

image

అహ్మదాబాద్ వేదికగా IND-NZ మధ్య ఎల్లుండి T20WC ఫైనల్ జరగనుంది. వర్షం లేదా ఏదైనా కారణాలతో ఆ రోజు మ్యాచ్ జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా మరుసటి రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆగిన దగ్గర నుంచే మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఫైనల్ ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. దురదృష్టవశాత్తూ 2 రోజులూ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది.

News March 6, 2026

ముస్లిం దేశాల్లో పాక్ దగ్గరే న్యూక్లియర్ వెపన్.. ఎలా?(1/2)

image

ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేయడంతో పాక్ వణికిపోయింది. ‘గడ్డి తినైనా సరే అణుబాంబు సాధిస్తాం’ అని అప్పటి PM భుట్టో శపథం చేశారు. సైంటిస్ట్ AQ ఖాన్ నెదర్లాండ్స్ నుంచి డిజైన్లు దొంగిలించి గ్లోబల్ బ్లాక్ మార్కెట్ సాయంతో ప్రాజెక్ట్-706 స్టార్ట్ చేశారు. పాక్ చేస్తున్నది తప్పని తెలిసినా రష్యాతో పోరాడేందుకు సాయపడుతుందని US సైలెంట్‌గా ఉండిపోయింది. చైనా సాయపడటంతో 1980ల నాటికే పాక్ లక్ష్యం చేరుకుంది.

News March 6, 2026

పాక్ ప్లాన్స్‌కు ఇజ్రాయెల్ చెక్.. భారత్ నో!(2/2)

image

ఇస్లాం దేశాల వద్ద న్యూక్లియర్ బాంబ్ ఉండడం రిస్క్ అని ఇజ్రాయెల్ ఫస్ట్ నుంచీ భావించింది. అందుకే పాక్ న్యూక్లియర్ ప్లాన్స్‌ను అడ్డుకునేందుకు కహుటా అణు కేంద్రాన్ని లేపేద్దామని అనుకుంది. అందుకోసం భారత ఎయిర్‌స్పేస్‌ను వాడుకుంటామని కోరింది. ముందు అంగీకరించిన ఇండియా.. పాక్‌తో అమెరికా క్లోజ్‌నెస్, JKలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనతో తర్వాత నో చెప్పింది.