News October 24, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలర్ట్..!

image

సీపీఐ పార్టీ ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పోలీసులు అప్రమత్తమై ప్రధాన రహదారులు, మార్కెట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రజాసంఘాలు, యువత, విద్యార్థులు, మహిళా సంఘాలు బంద్ విజయవంతం చేయడానికి సహకరించాలని మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ ప్రకటన విడుదల చేయడంతో అధికారులు, అధిక జాగ్రత్తలు తీసుకున్నారు. WGL కమిషనరేట్ అప్రమత్తమైంది.

Similar News

News October 24, 2025

తిలారు: రైలు ఢీకొని ఒకరు మృతి

image

తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్‌లో రైలు ఢీకొని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి 45 ఏళ్లు ఉంటాయాని, నీలం రంగు హాఫ్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలియజేశారు. ఆచూకీ తెలిసినవారు 91103 05494 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News October 24, 2025

ANU: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన నానో టెక్నాలజీ IV, V ఇయర్స్ సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 4వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

News October 24, 2025

పత్తి సేకరణలో సందేహాలు నివృత్తి చేయాలి: కలెక్టర్

image

పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రైతు సేవా కేంద్రం వారిగా రైతులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదకత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలన్నారు.