News September 10, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,142 మంది ఆత్మహత్య

image

తొందరపాటు నిర్ణయాలతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే నూరేళ్ల జీవితం సాఫీగా సాగుతుంది. ఉమ్మడి WGLలో 2025-జనవరి నుంచి ఆగస్టు వరకు 1,142 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ కమిషనరేట్ పరిధి(WGL, HNK, జనగామ)లో ఆగస్టు 31 వరకు 785 ఆత్మహత్యలు జరిగితే, BHPL 113, ములుగు 107, MHBD 137 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

Similar News

News March 6, 2026

HYD: ఇంజినీరింగ్ కాలేజీలో కొత్త ఫీజులు ఖరారు

image

నగరంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ ఫీజులు అమలుచేయనున్నారు. 3 సంవత్సరాలపాటు (2027- 28వరకు) ఈ నిబంధనలు అమలవుతాయి. ఇదిలా ఉండగా CBITకి అత్యధిక ఫీజు రూ.1.83 లక్షలు, ఆ తర్వాత వాసవికి రూ.1.75 లక్షలు, MGITకి రూ.1.67 లక్షలు, CVRకు రూ.1.63 లక్షలు, నారాయణమ్మకు రూ.1.62 లక్షలుగా నిర్ధారించారు.

News March 6, 2026

MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

image

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.

News March 6, 2026

వైభవోపేతంగా స్వామివారి కుంభాభిషేక మహోత్సవాలు

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు యాగశాలలో అష్టోత్తర కలశస్థాపన, మూలమంత్ర హవనాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9:34కు మేషలగ్నంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా కనకదుర్గ అమ్మవారి గోపురానికి కుంభాభిషేకం జరగనుంది.