News February 28, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57% పోలింగ్

image

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.

Similar News

News September 16, 2025

భద్రకాళి ఆలయంలో హుండీల లెక్కింపు

image

వరంగల్ భద్రకాళి ఆలయంలో హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో ఆలయానికి రూ. 61,58,999 ఆదాయం లభించింది. నగదుతో పాటు 316 యూఎస్‌ఏ డాలర్లు, 15 యూఏఈ దిరమ్స్‌తో పాటు ఇతర విదేశీ కరెన్సీ కూడా వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.

News September 16, 2025

కరీంనగర్: ‘చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలి’

image

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలని, కరీంనగర్ జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం మత్స్య శాఖ కమిషనర్ ఐఏఎస్ నిఖిలకు కరీంనగర్ జిల్లా మత్స్యకారులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మత్స్యశాఖ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు.

News September 16, 2025

OTTలోకి ‘వార్-2’ వచ్చేది అప్పుడేనా?

image

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఓటీటీ(నెట్‌ఫ్లిక్స్)లో రిలీజయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం 6-8 వారాల్లో సినిమాలు OTTలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.