News August 29, 2024
‘ఉమ్మడి విజయనగరం జిల్లాకు జ్వరమొచ్చింది’

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరపీడితులతో కిక్కిరిసాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీహెచ్సీలలో రోజుకు 400 వరుకు ఓపీలు, పీహెచ్సీల్లో సుమారు 200 వరుకు ఓపీలు నమోదవుతున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై వరుకు 435 మలేరియా,94 డెంగీ కేసులు నమోదయ్యాయి. క్షేత్ర స్థాయిల్లో వసతుల లేమితో రోగులు అవస్థలు పడుతున్నారు.
Similar News
News February 20, 2026
మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత: VZM SP

మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అధికారులకు ఆదేశించారు. మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు వారి రక్షణకు అవసరమైన భద్రత చర్యలు వెంటనే చేపట్టాలని సిబ్బందికి శుక్రవారం సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.
News February 20, 2026
VZM: ‘ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలి’

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యా శిక్షణ సంస్థ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ సామాజిక న్యాయం ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలో అసమానతలను తొలగించి ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 వినియోగించుకోవాలని సూచించారు.
News February 20, 2026
VZM: ‘ప్రభుత్వ పథకాల లక్ష్యాలను సాధించాలి’

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. శుక్రవారం నిర్వహించిన VCలో పలు శాఖల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పీజీఆర్ఎస్ వినతులు, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్యుత్, ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నా కాంటీన్లు, పౌర సరఫరాలు, గంజాయి నిర్మూలన, మహిళల భద్రత, తదితర లక్ష్యాలను సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో JC సేతుమాధవన్ పాల్గొన్నారు.


