News September 27, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 223 మద్యం షాపులు?

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 223 <<14205579>>మద్యం షాపు<<>>లకు ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో మొత్తం 165 షాపులకు గాను అన్ రిజర్వ్ షాపులు 149, కల్లుగీత కార్మికులకు 15, సొండిలకు 1 కేటాయించినట్లు తెలుస్తోంది. పార్వతీపురం జిల్లాలో 58 షాపులకు అన్ రిజర్వ్ 53, కల్లుగీత కార్మికులకు 5 షాపులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News October 10, 2024

దుర్గాదేవి అవతారంలో పైడితల్లి అమ్మవారు

image

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద గల అమ్మవారి వనం గుడిలో దుర్గాష్టమి అర్చకులు దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

News October 10, 2024

గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు

image

దసరా పండగ రోజుల్లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 10 నుంచి 16 వరకు గుంటూరు-రాయగడ(17243), ఈనెల 11 నుంచి 17 వరకు రాయగడ-గుంటూరు (17244) రైళ్లకు రెండు సాధారణ, రెండు స్లీపర్ బోగీలు జత చేయనున్నామన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. >Share It

News October 10, 2024

రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: మంత్రి

image

రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన మృతి పట్ల గురువారం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని కొనియాడారు. పుట్టు కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని పేర్కొన్నారు.