News April 8, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లావాసులకు అలెర్ట్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈరోజు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరంలోని 20 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 29, 2025

విజయనగరంలో నేడు ఉదయం 10 గంటలకే ప్రారంభం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి 1 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News December 28, 2025

ఇక నుంచి ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్: విజయనగరం కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్లినిక్‌కు ఆర్‌డీఓలు, తహశీల్దార్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. RDO, తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ భూ రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.