News October 6, 2025
ఉమ్మడి విశాఖలో 75 మందికి పదోన్నతులు

ఉమ్మడి విశాఖ జిల్లాలో 75 మంది తెలుగు, ముగ్గురు హిందీ భాష పండితులకు పదోన్నతులు లభించాయి. చివరిగా 2019లో కొందరికి పదోన్నతులు కల్పించి మిగిలిన వారిని డీఈఓ పూల్‌లో ఉంచారు. డీఈఓ పూల్‌లో ఉన్న 75 మంది భాష పండితులకు అడహక్ బేసిక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తూ విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు వీరు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 6, 2025
ADB: టికెట్ కోసం పోరు.. పార్టీ లీడర్లకు పెద్ద సవాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బడా నేతలకు సవాలుగా మారింది. సర్పంచ్ స్థానానికి ఇద్దరేసి, జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు, నలుగురు తమకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ అధిష్ఠానం వెంట పడుతున్నారు. భీంపూర్, ఉట్నూర్, బేల, భోరజ్, జైనథ్, సాత్నాల మండలాల్లో భారీగా పోటీ ఉండటంతో అన్ని పార్టీల జిల్లా నేతలకు తలపోటుగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే మరో ఇద్దరు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే భయం పట్టుకుంది.
News October 6, 2025
విజయనగరంలో మద్యం దుకాణాలు బంద్

శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా విజయనగరంలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. పట్టణంలో ఉన్న మొత్తం 14 మద్యం దుకాణాలతో పాటు 12 బార్లను నిన్న రాత్రి నుంచి అధికారులు మూసివేశారు. అలాగే జొన్నవలస, సుంకరిపేట, బియ్యాలపేటలో ఉన్న షాపులు కూడా మూతపడ్డాయి. సిరిమానోత్సవం పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి షాపులు పునఃప్రారంభం కానున్నాయని సీఐ మన్మథరావు తెలిపారు.
News October 6, 2025
కంచరపాలెం ఘటనలో విస్తుపోయే నిజాలు

కంచరపాలెం ఇందిరానగర్-5 <<17925697>>చోరీ ఘటన<<>>లో విస్తుపోయే నిజాలు వెలువడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి హాల్లో పడుకున్న ఎల్లమ్మ నోటికి ప్లాస్టర్ వేసి 6బంగారు గాజులు, 2తులాల చైన్ లాక్కున్నారు. పక్కగదిలో పడుకున్న కృష్ణకార్తీక్ రెడ్డి కాళ్లు,చేతులు కట్టి చేతులతో కొట్టి బంగారు ఉంగరం, బీరువాలో రూ.3లక్షల నగదు దోచేశారు. బాధితుల కారులోనే పరారైనట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు.