News March 28, 2026

ఉమ్మడి విశాఖ జడ్పీ సమావేశం: ప్రజా సమస్యలపై చర్చ

image

పాడేరు: ఉమ్మడి విశాఖ జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. ఈ కీలక భేటీకి అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ కృష్ణన్, హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. స్థానిక ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వారు బదులిస్తూ, ముగ్గురు అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కారాలు చూపుతామని స్పష్టం చేశారు.

Similar News

News April 14, 2026

ZHB: తమ్ముడి పెళ్లి.. ఇంతలో అక్క ఫ్యామిలీ దుర్మరణం

image

జహీరాబాద్‌కు చెందిన కవిరాజు(40)కు భార్య పావని(35), కుమార్తె కీర్తన(11), బాబు కార్తీక్ ఉన్నారు. దంపతులు ప్రైవేట్ జాబ్స్ చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. మే 1న పావని సోదరుడి పెళ్లి ఉండగా గడప కడిగేందుకు VKB జిల్లా రుక్మాపూర్‌కు <<19636029>>ఫ్యామిలీ<<>>తో కలిసి వెళ్లింది. సోమవారం ఉదయం స్కూటర్‌పై తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబలించింది. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో పెళ్లింట తీవ్ర శోకం నిండింది.

News April 14, 2026

కామారెడ్డి: ఈనెల 15 నుంచి ఇంటర్ ప్రత్యేక తరగతులు

image

కామారెడ్డి జిల్లాలో ఆశించినంత మేర ఇంటర్ ఫలితాలు రాకపోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నెల 15 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, మే నెలలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తామన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు చెల్లించాలని సూచించారు.

News April 14, 2026

ADB: పేకాటలో పట్టుబడ్డ కీలక నేతలు

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీజేపీ నేత, భైంసా మున్సిపల్ ఛైర్మన్ దత్తాద్రి, ఆర్మూర్ కాంగ్రెస్ కౌన్సిలర్ వెంటకట్ గౌడ్ అలియాస్ రవి గౌడ్, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వారి నుంచి రూ.1.79లక్షల నగదు, 2కార్లు, 6 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు మంచి చెడ్డలు చెప్పేవారు ఇలా పట్టుబడటం చర్చనీయాంశమయ్యింది.