News September 9, 2025
ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 10వ తేదీన జరుగుతాయని జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఒకటి నుంచి ఏడు వరకు గల స్థాయి సమావేశాలు వేరువేరుగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 10:30 నుంచి జరిగే సమావేశాలకు అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 9, 2025
సంగారెడ్డి: విద్యార్థులకు తక్షణమే వైద్యం అందించాలి: మంత్రి

మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటన జరిగిన గురుకుల పాఠశాలను పరిశీలించాలని కలెక్టర్ ప్రావీణ్యకు ఆదేశించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయట పడిన విద్యార్థులకు తక్షణమే వైద్య చికిత్సలు అందించాలన్నారు.
News September 9, 2025
మెదక్: ప్రజాకవి కాళోజీకి ఎస్పీ నివాళులు

జాతీయ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణకు కవిత్వం ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానుభావులని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్ చంద్ర బోస్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News September 9, 2025
జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పనులకు వారం రోజుల్లో, పెద్ద పనులకు రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.