News October 10, 2025
ఉమ్మడి విశాఖ జిల్లా హాకీ పోటీలకు 17 మంది బాలికలు ఎంపిక

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కపల్లిలో జరుగుతున్న ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో 17 మంది బాలికలు ఎంపికయ్యారు. వీరు ఉమ్మడి విశాఖ జిల్లా తరపున ఆడనున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాయుడు గురువారం తెలిపారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన వారిలో జయశ్రీ, లవ కుమారి, శాంతి, రాణి, లక్ష్మి, శ్రావణ దేవి, జాహ్నవి, దుర్గ, కనకమహాలక్ష్మి, సౌజన్య, పావని, టోనేశ్వరి తదితరులు ఉన్నారు.
Similar News
News October 10, 2025
సంస్కరణలతో దేశ అభివృద్ధికి బలమైన బాట: బాపట్ల కలెక్టర్

GST 2025 సంస్కరణలు దేశ వ్యాప్తంగా వ్యాపారాల్లో, పరిశ్రమల్లో సూపర్ సేవింగ్స్‌తో వేగంగా, తక్కువ ఖర్చుతో పురోగమించేలా మారిపోయాయని కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ-కామర్స్, ఆటో మొబైల్ రంగాలు, అనుబంధ పరిశ్రమలకు సరళమైన GST నిబంధనలు, తక్కువ పన్ను శ్లాబులు వర్తించాయన్నారు. దీంతో అభివృద్ధి సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
News October 10, 2025
సంగారెడ్డి: పది ప్రత్యేక తరగతులను పగడ్బందీగా నిర్వహించాలి: డీఈఓ

జిల్లాలలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, కేజీబీవీ, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ప్రతి వారం విద్యార్థులు లఘు పరీక్షలను నిర్వహించి వాటి ఫలితాలను రికార్డులో నమోదు చేయాలని సూచించారు.
News October 10, 2025
ఈ ప్లేయర్లను రిలీజ్ చేయనున్న CSK!

IPL-2026కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పలువురు ప్లేయర్లను <<17966400>>రిలీజ్<<>> చేయవచ్చని Cricbuzz తెలిపింది. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కరన్, కాన్వేలను వదులుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే అశ్విన్ రిటైర్ కావడంతో చెన్నై పర్సులో రూ.9.75 కోట్లు యాడ్ అయ్యాయి. అటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సహా శ్రీలంక స్పిన్నర్లు హసరంగ, మహీశ్ తీక్షణలను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.