News February 1, 2025

ఉమ్మడి ADB జిల్లాలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..!

image

మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5, 512 మంది ఉపాధ్యాయులు, 67, 768 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Similar News

News February 1, 2025

మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. మండలస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.

News February 1, 2025

పార్వతీపురం : మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

image

మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు ఎస్.దామోదరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

News February 1, 2025

సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించుటకు కలెక్టరేట్ కు రావద్దని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.