News January 30, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి: CM

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని CM రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతికుమారితో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు చేయాలన్నారు.
Similar News
News March 3, 2026
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే పంచకర్ల

పెందుర్తి నియోజకవర్గంలోని 10 వార్డుల్లో ఎనిమిది నెలల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. మంగళవారం 77వ వార్డులో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి రూ.7.5 కోట్ల విలువైన సిసి రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.
News March 3, 2026
MBNR: జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు: SP

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు లేదా ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియా వేదికల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరంగా చర్యలకు గురయ్యే అంశాలుగా పరిగణించబడతాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. SHARE IT
News March 3, 2026
పెంబర్తిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

పెంబర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన అజ్మీర గణేష్ (21)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


