News December 27, 2025

ఉమ్మడి KNRలో ‘ఎక్సైజ్’ అధికారుల ‘EXTRA దందా’..!

image

ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల ఓనర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి KNRలో 287 WINES ఉండగా రూ.7 కోట్ల టార్గెట్‌తో ఒక్కో షాప్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఇవే కాకుండా నెలకు రూ.15000లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట. దీంతో కొందరు మద్యం వ్యాపారులు మామూళ్లు చెల్లిస్తుండగా మరి కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారట.

Similar News

News December 29, 2025

మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

image

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.

News December 29, 2025

విశాఖ పోర్ట్‌ తొలి మహిళా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని అపరాంజి

image

మహిళా IAS అధికారి రోష్ని అపరాంజి కోరాటిమ పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం–మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆమె విశాఖ వాసి కావడం విశేషం. ఆమె AU నుంచి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్‌లో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. అస్సాంలో కలెక్టర్‌గా, కేంద్ర డిప్యూటేషన్‌లో VSEZలో సేవలందించిన ఆమెకు 2018లో PM అవార్డు లభించింది.

News December 29, 2025

యాదాద్రిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవేందర్ గౌడ్

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు ఆలయ పండితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.